HomeLaw and Orderఅయ్యా పీఎస్ వేటలో అధికార పార్టీ ....కొలిక్కి రాని కొత్త కొత్వాల్ కసరత్తు ......

అయ్యా పీఎస్ వేటలో అధికార పార్టీ ….కొలిక్కి రాని కొత్త కొత్వాల్ కసరత్తు ……

దిగ్గజ నేతలున్న జిల్లాలో అధికార బాధ్యతల్లో పనిచేయడం కత్తిమీద సామే అందుకే జిల్లాలో కీలక స్థానాల్లో నియామకాల ఫై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.

నిజామాబాద్ పోలీసు కమిషనర్ విషయంలో ఇదే తరహా కసరత్తులు జరుగుతున్నాయి. కమిషనర్ బదిలీ అయి వారం రోజులవుతుంది ప్రభుత్వం ఇంకా ఎవరిని నియమించలేదు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ నే ఇంచార్జి కమిషనర్ గా కొనసాగుతున్నారు.

నిజామాబాద్ పోలీసు కొత్వాల్ గా ఎవరి రాబోతున్నారనేది సర్వత్ర ఉత్కంఠ గా మారింది. జిల్లాకు చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు ఈసారి కొత్వాల్ నియామకంలో జోక్యం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

మొన్నటి దాక పనిచేసిన కల్మేశ్వర్ తో ఎదురైన అనేక చేదు అనుభవాలను దృష్టి లో పెట్టుకొని ఈసారి కొత్వాల్ పోస్టింగ్ లోనే తమ ప్రమేయం ఉండేలా వ్యూహ రచన చేస్తున్నారు.

తమకు అనుకూలంగా ఉండే అధికారికే కొత్వాల్ పోస్టింగ్ ఇవ్వాలని ఈపాటికే సీఎం రేవంత్ ను సైతం కోరినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో బిఆర్ యస్ ప్రభుత్వ హయాంలో కలెక్టర్ ,కమిషనర్ లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ల కనుసైరాల్లోనే పనిచేసారు.

అదే తరహాలో పాలనా వ్యవహారాల్లో తమ హవా ఉండాలని హస్తం నేతలు తహతహ లాడుతున్నారు. కల్మేశ్వర్ కమిషనర్ వుండగా అవమానాలు ఎదుర్కొన్న ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఈసారి పోలీసు వ్యవహారాల్లో తమ మాట చెల్లుబాటు కావాలనే పట్టుదలతో ఉన్నారు.

అందుకే దిగ్గజ నేతలు తమకు అనుకూలమైన అధికారుల పేర్లను కొత్వాల్ కోసం సిఫారస్ చేసారని ప్రచారం జరుగుతుంది. కల్మేశ్వర్ బదిలీ కాగానే కొత్త కమిషనర్ గా కామారెడ్డి ఎస్పీ గా సిద్దపేట్ కమిషనర్ గా పనిచేసి న స్వేత రెడ్డి పేరు తెరమీదికి వచ్చింది. కానీ ఓ కీలక నేత వద్దని వారిస్తున్నారని సమాచారం.

సీఎం సొంత జిల్లాకు చెందిన ఆమె వైపే సీనియర్ ఐపీఎస్ లు మొగ్గు చూపుతున్నారు. మొన్నటిదాకా పనిచేసిన కల్మేశ్వర్ ను ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో నియామకం అయ్యారు .

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన్ని మార్చే విషయంలో రేవంత్ సర్కార్ వెనుకాడింది. అందుకే లోకసభ ఎన్నికల దాక ఆయనే కొనసాగించడానికి సిద్ధం అయింది.ఎలాంటి సిఫారస్ లేకుండా పోస్టింగ్ కావడంతో ఆయన కూడా నిక్కచ్చిగా పనిచేస్తూ వచ్చారు అధికార పార్టీ అగ్ర నేతల ఒత్తిళ్లను సైతం లైట్ తీసుకున్నారు.

ఆయనను బదిలీ చేయాలని ఓ ఎమ్మెల్యే నేరుగా సీఎం ను కోరినట్లు సమాచారం. కానీ ఈలోపు కల్మేశ్వర్ సతీసమేతంగా కేంద్ర సర్వీస్ లోకి వెళ్ళడానికి దరకాస్తు చేసుకోవడంతో ఆయన బదిలీ చేయడానికి సీఎం వద్దన్నారు. దాదాపు పది మాసాలు పనిచేసిన ఆయన జిల్లా పోలీస్ శాఖ లో చెరగని ముద్ర వేశారు.

యస్ ఐపిఎస్ అంటే ఎలా ఉంటారనే రేంజ్ పనిచేసారు. కానీ తదుపరి కొత్వాల్ ఎవరైనా సరే అధికార పార్టీ దిగ్గజ నేతలకు అనుకూలంగా పనిచేయక తప్పని పరిస్థితి వుంటుంది.

ప్రభుత్వ పెద్దలు ఏరికోరి పోస్టింగ్ ఇస్తారు కాబట్టి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడం అనివార్యం అవుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments