మోపాల్ మండలలోని బైరాపూర్ గ్రామస్తులు నిజామాబాద్ అటవీ శాఖ ను ముట్టడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ముందస్తుగా అటవీ శాఖ కార్యాలయం వద్ద వారి పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే..బైరాపూర్ గ్రామంలో కొన్నిరోజులుగా పోడు భూములను సాగు చేస్తున్నారనే సమాచారంతో మంగళవారం అటవీశాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు.
భూముల్లో సాగు చేస్తున్న పంటను ధ్వంసం చేసేందుకు ఫారెస్ట్ అధికారులు గడ్డిమందును తమ వెంట తీసుకెళ్లారు. దీంతో అధికారులను గ్రామంలోకి రానీయకుండా రైతులు నిరసన తెలిపారు.
ఈ మేరకు గత కొన్ని రోజులుగా అటవీశాఖాధికారులు వేధిస్తున్నారని నిరసిస్తూ ఓ రైతు గడ్డిమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ మేరకు హుటాహుటిన అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో బైరాపూర్ గ్రామస్థూల అటవి శాఖను ముట్టడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు కార్యాలయం వద్ద భారీగా భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశారు.
