HomeTelanganaNizamabadమున్సిపల్ ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్య కల్పించాలి..

మున్సిపల్ ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్య కల్పించాలి..

టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు..

రానున్న స్థానిక మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో మాదిగలకు ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేటర్, కౌన్సిలర్, సీట్ల ను కేటాయించాలని టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ కోరారు.

ఇటుక రాజు మాదిగ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ లు శనివారం హైదరాబాదులోని గాంధీభవన్లో టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి బుద్ధుని ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు అవుతున్న ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ సామాజిక వర్గానికి అధిక సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మాదిగలకు న్యాయబద్ధంగా కట్టుబడి కాంగ్రెస్ ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్యాల గోవర్ధన్, టిఎంఆర్పిఎస్ నాయకులు హరి మాదిగ , మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అఖిల్ మాదిగ, రిషి మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments