Sunday, April 26, 2026
HomeTelanganaNizamabadరోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి: బొబ్బిలి రామకృష్ణ..

రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి: బొబ్బిలి రామకృష్ణ..

నగరంలోని పూలంగ్ వీధిలో టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టిన రోడ్డు పనులను నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు.

రోడ్డు నిర్మాణ సమయంలో కాలనీవాసులు తమ ఇళ్లలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పనులు సాగుతున్నంత కాలం ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

అదేవిధంగా, ఈ అభివృద్ధి పనులకు కాలనీ వాసులు కూడా కాంట్రాక్టర్‌కు సహకరించి, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అయూబ్ అహ్మద్, ఆకుల రాజు, నాగరాజు, ఇమ్రాన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!