HomeCRIMEబ్యాండు విషయంలో గొడవ .... ఇరువర్గాల మధ్య ఘర్షణ.......ఓ యువకుడు ఇంటిమీదికి దూసుకెళ్లిన గ్యాంగ్...

బ్యాండు విషయంలో గొడవ …. ఇరువర్గాల మధ్య ఘర్షణ…….ఓ యువకుడు ఇంటిమీదికి దూసుకెళ్లిన గ్యాంగ్ ……లాఠీ ఛార్జ్ చేసిచెదరగొట్టిన పోలీసులు

గణేష్ నిమజ్జన ఊరేగింపు బ్యాండు విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానల మారి ఇరువర్గాల మధ్య గ్యాంగ్ వార్ గా మారింది. చివరి ఓ యువకుడి ఇంటిమీద కి గ్యాంగ్ మూకుమ్మడిగా వెళ్లి దాడి కి దిగింది.

చివరికి పోలీసులు లాఠీ ఛార్జి చేసి ఇరువర్గాలకు చెదరగొట్టారు. ఆర్యా నగర్ సమీపంలో చిన్నారులు తమ గణేష్ విగ్రహం నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారు.

అక్కడే ఓ బీజేపీ నేత బ్యాండు ను ఆపేసి తమ వద్ద కాసేపు సౌండ్ చేసి వెళ్లాలని డిమాండ్ చేసాడు.కానీ అందుకు చిన్నారులతో పాటు బ్యాండ్ గ్రూప్ సైతం ససేమిరా అన్నారు.

దీనితో బీజేపీ నేతకు చిఱుకెత్తుకొచ్చింది. అంతే అక్కడున్న చిన్నారుల చితక గొట్టాడు.ఈ విషయం తెలిసి మాదవనగర్ నగర్ కు చెందిన ఓ యువకుడు తన గ్యాంగ్ ను వెంటేసుకొని వచ్చాడు. బీజేపీ నేతకు లాగి కొట్టాడు.

దీనితో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నాలుగో టౌన్ పోలీసు లు వెళ్ళి చెదరగొట్టారు. కానీ సదరు బీజేపీ నేత కోటగల్లి శివాజీ నగర్ ప్రాంతాల్లో స్నేహితులను పిలిచి తన మీద చేయి చేసుకున్న యువకుడు ఇంటి మీదికి దాడి చేయడానికి వెళ్లారు.

ఏ బి యస్ గేటెడ్ కమ్యూనిటీ లోకి చొరబడ్డారు. ఆ యువకుడు ఇంటిమీది రాళ్ల వర్షం కురిపించారు. అక్కడి సెక్యూరిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే వెళ్లారు. భారీ సంఖ్యలో యువకులు తగిన మైకం లో వీరంగం చేస్తుండడంతో పోలీసులు లాఠీ లకు పనిచెప్పారు దీనితో యువకులు తలోదిక్కు పరుగులు తీశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments