ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు నగరంలోని గౌతంనగర్ కు చెందిన ఇద్దరు యువకులు గణేష్ నిమజ్జనం సందర్భంగా బాసర గోదావరికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో శ్రీశాంక్,అతని స్నేహితుడు ఇద్దరు ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోయారు.
గమనించిన స్థానికులు హుటాహుటిన 108 లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
