Monday, December 8, 2025
HomePOLITICAL NEWSNationalరేవంత్, మోడీ మీద మాట్డాడం సిగ్గుచేటు …..అర్బన్ ఎమ్మెల్యే

రేవంత్, మోడీ మీద మాట్డాడం సిగ్గుచేటు …..అర్బన్ ఎమ్మెల్యే

రేటేంతన్న ముఖ్యమంత్రి రేవంతు మోదీ అవినీతిపరుడనడం సిగ్గుచేటని కాంగ్రెస్ వాళ్ళు స్థాయి కీ మించిన మాటలు మాట్లాడుతున్నారని అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవినీతి గురించి మాట్లాడే అర్హతే లేదని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ అన్నారు ఆయన శుక్రవారం మీడియా తో మాట్లాడారు

కాంగ్రెస్ గత 50,60 ఏళ్ల పాలన మొత్తం అవినీతి మయమే 2G స్కామ్,అయినా 3g స్కామ్ అయినా అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుంది అలాంటి కాంగ్రెస్ నాయకులు వ్యక్తి గతంగా కుటుంబం కూడా లేకుండా, దేశాన్నే కుటుంబంగా భావించి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నిరంతరం దేశఅభివృద్ధి, దేశాప్రజలకు సేవాలాందిస్తున్న మోదీ మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతుంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు తప్పకుండ ఓటుతో బుద్ది చెప్పడం ఖాయమన్నారు

కాంగ్రెస్ ఈ దేశ విచ్చిన్నన్ని కోరుకుంటుంది అందుకే CAA అమలు చేయమని,370 ఆర్టికల్ మల్లి అమలు చేస్తాం అని అంటుంది

మోదీ గారి పాలనలో దేశాసరిహద్దుల్లో ఉన్న సైనికుడు కూడా ధైర్యంగా నిద్రపోయాడు అంటే సమర్థవంతమైన నాయకుడు ఉంటే పాలన ఏవిదంగా ఉంటాదో చేసి చూపెట్టిండు 

గడిచిన పదేళ్లలో ఒక్క బాంబు పేలుడు కూడా లేదు, సర్జికల్ స్ట్రైక్ లాంటి సహసమైనా నిర్ణయాలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ కు ఉందా…? మనం చూడలేదా 60 ఏళ్ల పాలన.

 పాకిస్తాన్ నుండి కమాండర్ అభినందన్ ను తిరిగి సురక్షితంగా భారత్ కీ తీసుకురావడమే అందుకు నిదర్శనం.

ఇగ తెలంగాణ లో కాంగ్రెస్ 6 గ్యారంటీల మోసంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు

ఎన్నికల సమయంలో అనేక హామీలు 420 మోసాలు….గ్యారంటీలకే దిక్కు లేదు ఇంకా మేనిఫెస్టో గురించి మాట్లాడటమే సిగ్గు చేటు 

రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ యువతకు 4000, ఆడపిల్ల పెళ్ళికి తులం బంగారం ఎక్కడ పోయినాయి…? 

 కాంగ్రెస్, బిఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని ఈ రోజు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న రెండు తోడు దొంగలే 

కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేక పార్టీ, నిన్న జరిగిన భద్రాద్రి రాములోరి లైవ్ టెలికాస్ట్ ని అడ్డుకోవాలని చూసింది కాంగ్రెస్ పార్టీ..EC అనుమతితో తోక ముడిచింది

హైదరాబాద్ లో MIM తో దోస్తీ ఎట్లా కుదిరిందో రేవంత్ సమాధానం చెప్పాలి…

రేవంత్ కూడా భయం పట్టుకుంది అందుకే మతిపోయి ఏదేదో మాట్లాడుతుండు రాజగోపాల్ రెడ్డి హోమ్ మంత్రి కావాలంటుండు, బట్టి బాట వేరే మొత్తానికి చుస్తే …కాంగ్రెస్ లో ఉన్న అగ్రనాయకులే రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయం.

ఒక్కటే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ కీ ఓటు వేస్తె సోనియా కుటుంబం బాగుపడుతది, బిఆర్ఎస్ కీ ఓటు వేస్తె KCR కుటుంబం బాగుపడుతది, కానీ నరేంద్రమోదీ నాయకత్వంలో బిజెపి కీ ఓటు వేస్తె దేశం బాగుపడుతది, మన కుటుంబం బాగుపడుతది 

ఈ రోజు మోదీ గ్యారంటీ అంటే మన దేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి

చిట్టచివరి పేదోనికి సంక్షేమ పథకాలు అందించాలని, వారి అభివృద్ధికి సంకల్ప పత్రాన్ని విడుదల చేయడం జరిగింది

ఈ సంకల్ప పత్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!