ఓ వైపు బిఆర్ యస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ హోదా లోకసభ ఎన్నికల ప్రచారం చేయాలని కవిత బెయిల్ పిటిషన్ లలో పదే పదే ప్రస్తావిస్తున్నారు కానీ ఇదే లోకసభ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరకలు అంటకుండా బిఆర్ యస్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే లిక్కర్ కేసులో తీహార్ జైలు లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఫొటో లు ఎన్నికల ప్రచారం లో ఎక్కడ కనిపించకుండా చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో నూ కవిత ప్రస్తావన లేకుండా చూస్తున్నారు. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఉన్న కవిత ఫొటో లేకుండానే శుక్రవారం బిఆర్ యస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ యాడ్స్ ప్రధాన పత్రికల్లో వచ్చాయి. లక్షలాది రూపాయల వెచ్చించి ఇచ్చిన ఈ యాడ్స్ లో కవిత ఫొటో ఎందుకు మిస్ అయిందనేది గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశం అయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. లోకసభ పరిధి లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లాల్లోను బిఆర్ యస్ అభ్యర్థులు ఆమె ఫొటో ప్రాధన్యత గా వాడుకున్నారు. లోకసభ ఎన్నికల్లోనూ ఆమె స్టార్ క్యాంపెయినర్ హోదా అన్నీ తానై ప్రచారం చేస్తారని పార్టీవర్గాలు భావించాయి.
ఎహే అక్క కు బెయిల్ రావడం పక్కా ప్రచారం కు రావడం ఖాయమనే ధీమాలో క్యాడర్ ఉండే. ప్రచారం చేయడానికి రావడం సంగతి దేవుడెరుగు కనీసం యాడ్స్ లో ఆమె ఫొటో పెట్టడానికి కూడా పార్టీ ఆసక్తిగా లేనట్లుంది. పార్టీలో అధినేత కెసిఆర్ కేటీఆర్ ల తర్వాత మూడో స్థానంలో ఉండే కవిత పదేళ్లు పార్టీలో ప్రభుత్వంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించే వారు. మంత్రులు ఎమ్మెల్యే లు కూడా ఆమె తో భేటీ కోసం ఎదురుచూసేది.
ఏ జిల్లాలో అయినా మంత్రులు ఎమ్మెల్యే ల యాడ్స్ ల్లో ఆమె ఫొటో వుండేది. ఇక నిజామాబాద్ జిల్లా విషయంలో అయితే ఆమె మాటే ఫైనల్ అన్నట్లుగా వుండేది.మంత్రి ఎమ్మెల్యే లు ఆమె మాట జవ దాటని పరిస్థితి ఉండే . కానీ లిక్కర్ కేసులో అరెస్టు అయి జైలు పాలుకావడంతో ఆ స్కామ్ తాలూకు మచ్చ ఎన్నికల్లో పార్టీ మీద పడకుండా ప్రచారంలో ఆమె ఫొటో ను గాయబ్ చేశారు