సార్వత్రిక ఎన్నికల కు సంబంధించి నామినేషన్ ఘట్టం గురువారం మొదలయ్యింది. మొదటి రోజు రెండు నామినేషన్ లు దాఖలు కాగా రెండో శుక్రవారం మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్ లు వేయనున్నారు.బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఎలాంటి హడావుడి లేకుండా కొంతమంది పసుపు రైతల తో కలిసి నామినేషన్ వేయనున్నారు.
ఆతర్వాత భారీఎత్తున ప్రజలతో కలిసి కేంద్రమంత్రి సమక్షం లో మరోసారి నామినేషన్ వేయనున్నారు. బిఆర్ యస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారమే నామినేషన్ అట్టహాసంగా వేయనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తో కలసి ఆయన నామినేషన్ వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలను తరలిస్తున్నారు. కలెక్టరేట్ మైదానం లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.