HomeCRIMEమల్లుపేట్ ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం; పలువురికి గాయాలు

మల్లుపేట్ ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం; పలువురికి గాయాలు


సదాశివనగర్ మండలం మల్లుపేట్ ఎక్స్ రోడ్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది .


హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన మహీంద్రా ఎక్స్ యు వి300 నంబరు గల వాహనం అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి,ఎదురుగా నిజామాబాద్ వైపు వెళ్తున్న హ్యుందాయ్ ఆరా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో మహీంద్రా లో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు గాయాలు కాగా, హ్యుందాయ్ ఆరా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే సదాశివనగర్ పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

అనంతరం రెండు వాహనాలను రోడ్డుకు పక్కకు తొలగించి ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments