నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా సాయి చైతన్య సోమవారం భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీలలో భాగంగా హైదరాబాద్ నార్కోటిక్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న ఆయన నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు.పోలీసు కమీషనర్‌కు సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం కమిషనరేట్‌లోని పోలీస్ అధికారులు నూతన పోలీసు కమీషనర్‌కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
