కాసులు కురిపించే ఇసుక దందా కోసం రాజకీయ వైరాలు పక్కకు పెట్టేసారు. గుత్తేదారు గా అవతారం ఎత్తిన గులాబీ నేత అధికార పార్టీ నేతలకు వాటాలు ఎరా గా వేసి అక్రమ దందా కు అధికార ముద్ర వేసుకున్నాడు.కానీ హైకోర్టు ఆదేశాలతో ఇసుక అక్రమ దందా గుట్టు వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం ఆరు క్వారీలకు అనుమతి లేక పోయిన ఇసుక రవాణా జరగడం ఫై హైకోర్టు ఆక్షేపించింది. అక్రమ దందా ఫై కొరడా ఝుళిపించింది. ఇసుక గుత్తేదార్లు విసిరే కాసుల యావ లో ఉన్న కామారెడ్డి జిల్లా యంత్రాంగానికి గూబ గుయ్యమనేలా ఆదేశాలు ఇచ్చింది.
కాల పరిమితి ముగిసిన బీచ్ కుందా ఏరియా లో ఆరుచోట్ల యధావిధిగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయంటూ కామారెడ్డి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్రకాష్ రాసిన లేఖ మీద హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ వ్యవహారంను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ప్రభుత్వానికి నోటిస్ లు జారీచేసింది.ఆరు క్వారీలో ఒక్కో రోజు ఇసుక తవ్వకాలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ 30 లక్షల నష్టం జరుగుతుందని రెవెన్యూ పోలీసు మైనింగ్ ఖనిజా అభివృద్ధి సంస్థల అధికారులు కుమ్మకై
ఈ దందా సాగిస్తున్నారనేది పిటిషన్ దారుడి అభియోగం. కోర్టు ఆదేశాలతో కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఆసక్తి గా మారింది.
బిచ్ కుందా మండలం లో ఖడ్గం షెట్కూర్ ల మధ్య ఆరు క్వారీలకు గతంలో అధికార పార్టీ పెద్దల అండతో జిల్లాలో కీలకమైన ఈ ఇసుక క్వారీ లను చేజిక్కించుకున్న ఓ గుత్తేదారు నేతలు మీడియా తో పాటు అధికారులను కాసుల తో మేనేజ్ చేస్తూ నిబంధలను తొక్కేసి మరీ కోట్ల రూపాయల విలువైన ఇసుక ను తరలించుక పోయారు .
ప్రజాప్రతినిధి తనయుడి కనుసన్నల్లోనే ఈ దందా సాగేది . కానీ ప్రభుత్వం మారినా సరే యదేచ్చగా దందా ను ఎలాంటి అనుమతులు లేకుండా అదికూడా రాజమార్గంలోనే సాగిస్తూ వచ్చాడు.అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ కీలక నేతలకు సైతం మామూళ్ల రుచి చూయించాడు.
అందుకే క్వారీల కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి గడువు ముగిసి మూడు నెలలు పూర్తీ అయినా సరే ఇసుక తవ్వకాలేమి ఆగలేదు.