పోతంగల్ మండలం జన్నపల్లి గ్రామ సర్పంచ్ దస్తగిరి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి బోధన్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట బైఠాయించింది . తనను వివాహం చేసుకుంటానని చెప్పి అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది .
ఆరేళ్లుగా తాము ప్రేమించుకున్నామని.. రెండుసార్లు తనకు అబార్షన్ సైతం చేయించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకుందామని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని.. అతడితో తనకు పెళ్లి జరిపించాలని ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసింది.
