జిల్లా చరిత్ర లోనే ఒకే రోజు ఏకంగా ఏడుగురు క్యాబినెట్ మంత్రులు జిల్లాకు వస్తున్నారు. వీరంత రెండు హెలి క్యాఫ్టర్ లలోవస్తున్నారు.ఈ మేరకు నాలుగు హెలి ఫ్యాడ్ లను అందుబాటులోకి తెస్తున్నారు.
మంత్రులు .శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,పొన్నం ప్రభాకర్,తుమ్మల నాగేశ్వరరావు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,సీతక్క,కొండ సురేఖ,లతో పాటు దామోదర్ రాజా నర్శింహా సైతం వచ్చే అవకాశం ఉంది. మంత్రులే కాదు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షి లతో ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శి లు సైతం వస్తున్నారు. వీరుకూడా ప్రైవేట్ ఛాపర్ లోనే జిల్లాకు వస్తున్నారు. పోలీసు శాఖ సైతం భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తుంది.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక మొదటి సారి తన సొంత జిల్లానిజామాబాద్ కు వస్తున్నారు. ఆయన కు స్వాగతం పలకడానికి ఆయా నియోజకవర్గాల నుంచి భారీఎత్తున ప్రజలను సమీకరిస్తున్నారు.
