నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగితండాలో మంగళవారం గిరిజన ప్రజలు శీత్లా పండుగను వారి సాంప్రదాయ బద్ధంగా ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా పెళ్ళికాని కన్నె యువతులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇంట్లో వండుకొని తీసుకొచ్చిన తీపి నైవేద్యాన్ని శీత్లా భవాని అమ్మ వారికి సమర్పించుకున్నారు.
ఈ సందర్భంగా గిరిజన ప్రజలందరూ కూడా ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిత్వాన్ని చాటుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, గ్రామస్థులు అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని, పాడి పశువులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారు మొక్కుకున్నారు.
అనంతరం గుడి పరిసర ప్రాంతం చుట్టుప్రక్కల వంటలు చేసుకొని కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి సంతోషంగా భోజనం చేశారు. ప్రకృతి వాతావరణంలో ప్రశాంతంగా సేద తీరిన అనంతరం అందరూ తమ ఇళ్లకు చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలోవత్ రమేష్, నాయక్ శంకర్, కరోబరీ రాజు, గుడి చైర్మన్ కేతావత్ రమేష్, యువతీ యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.
