కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై లాఠీఛార్జ్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీనేతలు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ని మంగళవారం ముట్టడికి యత్నించింది. ప్రధాని మోదీ ఇంటి దగ్గరలో మెరుపు ధర్నాకు దిగింది . ఇటీవల చోటుచేసుకున్న విద్యార్థుల నిరసనలు, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, తీవ్ర అవకతవకలకు నిరసనగా కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్ర నేతలు నిరసనకు దిగారు.
ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధికారిక నివాసం వైపు కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే, ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు ప్రధాని నివాసం ఎదుటే రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
మోదీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నివాస ప్రాంతం అంతా.. ‘తానాషాహీ నహీ చలేగీ’, ‘మోదీ ఇస్తీఫా దో’ అనే నినాదాలతో హోరెత్తుతోంది.
విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.అయితే కేంద్ర హోం సహాయ మంత్రి వచ్చి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అయ్యారు
