మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలోని ఆరో టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..
నగర శివారులోని సారంగాపూర్, వడ్డెర కాలనీలో దుబ్బాక సాయమ్మ అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది.
ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. సాయమ్మ భర్త గత కొన్ని రోజుల క్రితం చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అయితే గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆమెను ఇంట్లోనే హత్య చేసినట్లు తెలుస్తోంది.
స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
