నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్జా పూర్ శివర్ అడవి ప్రాంతం లో పేకాట స్థావరం పై రైడ్ చేసి 11మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్ మస్తాన్ ఆలి ఆధ్వర్యంలో ఎస్ఐ గోవింద్, మహేష్ , సిబ్బంది కలిసి దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి 10 సెల్ ఫోన్, నగదు రూ 31,410 నగదు స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం నవీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ కు అప్పగించినట్లు తెలిపారు.
