నగర శివారులో దారి దోపిడీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 3వ తేదీన రెంజల్ మండలం కిషన్ తాండాకు చెందిన గూగుల్లోత్ గోపాల్ నిజామాబాద్‌లో మేస్త్రి పని ముగించుకుని, రాత్రి 10 గంటల సమయంలో నవీపేట్ వెళ్లేందుకు బోధన్ బస్టాండ్ వద్ద వేచి ఉన్నాడనీ అన్నారు. ఆ సమయంలో షేక్ హర్షద్ అనే ఆటో డ్రైవర్, గోపాల్‌ను తన ఆటోలో ఎక్కించుకున్నాడు.
నవీపేట్ వెళ్లే దారిలో గుండారం గ్రామ పరిసరాల్లోకి వెళ్లగానే, నిందితుడు ఆటోను ఆపి గోపాల్‌ను భయభ్రాంతులకు గురి చేసి అతని వద్ద ఉన్న 5,000 రూపాయల నగదు, సెల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడనీ తెలిపారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఈ మేరకు మంగళవారం సారంగాపూర్ వద్ద నిందితుడు షేక్ హర్షద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుండి దారి దోపిడీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.
దారి దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్..నగర శివారులో దారి దోపిడీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
ఈ నెల 3వ తేదీన రెంజల్ మండలం కిషన్ తాండాకు చెందిన గూగుల్లోత్ గోపాల్ నిజామాబాద్‌లో మేస్త్రి పని ముగించుకుని, రాత్రి 10 గంటల సమయంలో నవీపేట్ వెళ్లేందుకు బోధన్ బస్టాండ్ వద్ద వేచి ఉన్నాడనీ అన్నారు. ఆ సమయంలో షేక్ హర్షద్ అనే ఆటో డ్రైవర్, గోపాల్‌ను తన ఆటోలో ఎక్కించుకున్నాడు.