నిజామాబాద్ పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి.నగరంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలోఎన్నిక పక్రియ నిర్వహించారు .
అధ్యక్ష పదవికి మైసరి సంతోష్, వాల రవీందర్ రావు, కార్యదర్శులుగా మాదాసు మల్లేష్, మామిడి రాజశేఖర్, కోశాధికారులుగా బేతుగంగాధర్, బత్తుల మురళి లు పోటీపడ్డారు 317 ఓట్లు పోలు కాగ అధ్యక్ష అభ్యర్థులలో మైసరి సంతోష్ కు 207వాల రవీందర్రావుకు 110 ఓట్లు వచ్చాయి.
97 ఓట్ల తేడతో మైసరి సంతోష్ ఘన విజయం సాధించారు. కార్యదర్శిగా మాదాస్ మల్లేష్, కోశాధికారిగా బేతు గంగాధర్ లు గెలుపొందారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బీర్కూరు సుధాకర్, కోశాధికారి మోర సాయిలు,, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సీనియర్ కెమిస్ట్రీ వినోద్ గౌడ్,పట్టణ కమిటీ ప్రస్తుత అధ్యక్షులు అలసాని శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
