గత మూడు రోజులుగా హుజురాబాద్ లో జరిగినటువంటి రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ హాకీ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా పురుషుల హాకీ జట్టు రెండో స్థానం కైవసం చేసుకుంది.
హుజురాబాద్ లో జరిగిన సినియర్ హకీ టోర్నమెంట్ లో సెమిస్ లో హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించి ఫైనల్లో మెదక్ జట్టు తో హోరాహోరి పోరులో 2-3 తో రన్అప్ గా నిలిచింది. నిజామాబాద్ హకీ జట్టు టోర్నీలో తిరుగులేని అధిపత్యన్ని కోనసాగించిన బలమైన మెదక్ జట్టు చేతిలో ఒక్క గోల్ తో ఓడిపోయింది.
గెలుపొందిన క్రీడాకారులకు పలువురు జిల్లా వాసులు అభినందనలు తెలియజేశారు. మున్ముందు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వారిని ఆకాంక్షించారు.
