HomeTelanganaNizamabadజిల్లా పేరు మార్పుతోనే శని విముక్తి..ఉపాధి'కి కొత్త ఊపిరి..అభివృద్ధిని గాలికొదిలేసి, కేవలం కమిషన్ల కోసమే పాలన..పార్లమెంట్...

జిల్లా పేరు మార్పుతోనే శని విముక్తి..ఉపాధి’కి కొత్త ఊపిరి..అభివృద్ధిని గాలికొదిలేసి, కేవలం కమిషన్ల కోసమే పాలన..పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ధ్వజం..

జిల్లాకు పట్టిన శని వదలాలంటే నిజాం పేరు మార్చాల్సిందే. నిజామాబాద్‌ను ‘ఇందూరు’గా నామకరణం చేసినప్పుడే అసలైన విముక్తి లభిస్తుంది” అని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఉద్ఘాటించారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోనీ బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై, స్థానిక ప్రజాప్రతినిధులపై నిప్పులు చెరిగారు. జిల్లా అభివృద్ధిని గాలికొదిలేసి, కేవలం కమిషన్ల కోసమే పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

ప్రస్తుతం ఉన్న పేరు కేవలం తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఖచ్చితంగా ‘ఇందూరు’గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. “గతంలో ఇంటిలో పేరు మార్పు ప్రస్తావన వస్తే అడ్డుకున్నారు. కానీ ఈసారి గతం కంటే 20 శాతం సీట్లు అదనంగా సాధించి, సత్తా చాటుతామని జోస్యం చెప్పారు.

ప్రజలంతా ఇప్పటి నుంచే ఇందూరు పేరును అలవాటు చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు.పట్టణాల్లోని మౌలిక సదుపాయాల లేమిపై ఎంపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా మైనారిటీ గల్లీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. “బోధన్‌లో ఫ్లైఓవర్ల పనులు ఏళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వారికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదా అని ప్రశ్నించారు.

పావులా వడ్డీ రుణాలు కేంద్రం ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు.పంతగి లాంటి నేతలు ఐదేళ్లకు ఒకసారి కనిపిస్తారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధికి, వికసిత్ భారత్‌కు ఓటు వేయాలి” అని కోరారు.రైల్వే కనెక్టివిటీ పెంపునకు కేంద్రం పెద్దపీట వేస్తోందని, నియోజకవర్గంలో అనేక చోట్ల ఆర్ఓబీ పనులను చేపడుతున్నామని వివరించారు.

స్కూళ్లు, ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ హౌస్ పాలన వీడి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని హెచ్చరించారు.

*ఉపాధి’కి కొత్త ఊపిరి..* కేంద్ర ప్రభుత్వం నూతనంగా పార్లమెంట్‌లో పాస్ చేసిన ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ పథకం గురించి అర్వింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో ఈ కొత్త చట్టం వచ్చింది. ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడం జరిగిందని అన్నారు.

గతంలో 100 రోజులు ఉన్న పనిదినాలను కేంద్రం 125 రోజులకు పెంచిందని, గిరిజన ప్రాంతాల్లో ఇది 150 రోజులకు చేరుతుందని వివరించారు. కూలీల అమౌంట్ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే పడుతుందని, మధ్యలో ఎవరూ కమిషన్లు కొట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇదే కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చేసుకోవాలని ఆయన అన్నారు. అలాగే ఈ పథకంలో వ్యవసాయ నాట్లు, కోతల సమయంలో వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 60 రోజులు బ్రేక్ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాలు 60:40 ఉన్నాయని అన్నారు.

ఈ పథకంలో గ్రౌండ్ వాటర్ రీచార్జ్ బాగుంటుందని అన్నారు. జీ రామ్ జీ పథకంను అందరూ స్వాగతించాలి అని పేర్కొన్నారు.జీఎస్వై (GSY) వంటి పథకాల నిధులు మంజూరైనా, రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు పెట్టకపోవడంతో అవి ఆగిపోయాయని ఆరోపించారు.

రాష్ట్రం బాధ్యతగా పనిచేయాలని, ఇక నుంచి ‘ఫామ్ హౌస్’ పాలన సాగదని హెచ్చరించారు.రామచంద్రుని పేరుతో పథకాలు వస్తుంటే కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్రవంతి రెడ్డి, బిజెపి నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments