ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. కెసిఆర్ అంతరంగికుడు ఎమ్మెల్సీ నవీన్ రావు ను లక్ష్యంగా చేసుకొని సిట్ దర్యాప్తు మరింత వేగం పెంచింది. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోని నవీన్ రావు కు చెందిన దిగా భావిస్తున్న ఓ భవనంలో సోమవారం ఉదయం సోదాలు జరిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దీనినే ప్రణీత్ రావు భుజంగరావు లు ఈ భవనం ను సురక్షిత స్థావరంగా చేసుకొని ట్యాపింగ్ జరిపారని దర్యాప్తు బృందం విచారణలో వెల్లడయింది. నవీన్ రావు ఆదేశాల మేరకు అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారట.
ఈ వ్యవహారంలో ఆయన ప్రమేయం ను పక్కాగా నిర్దారించుకున్న సిట్ ఆయనను విచారించడం ద్వార గత ప్రభుత్వ పెద్దల కు ట్యాపింగ్ ఉచ్చు బిగించే ఆలోచనలో ఉన్నారు. కానీ నవీన్ రావు దుబాయి లో ఉన్నట్లు గుర్తించారు. ఆయన్ని ఎలాగైనా రప్పించి ఆయన స్టేట్మెంట్ ఆదారంగానే దర్యాప్తు లో తదుపరి తుది అడుగులు వేయాలనే ఆలోచలో ఉన్నారు. ఇదివరకు ట్యాపింగ్ లో అధికారులను ఎవ్వరిని విచారించిన సరే అప్పటి ఐజి ప్రభాకర్ ఆదేశాల మేరకే చేశామని చెప్తున్నారు.
కానీ గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం నిర్దారణ జరగాలంటే ప్రభాకర్ ను విచారించాలి కానీ ఆయన ఇప్పట్లో అమెరికా నుంచి వచ్చేలా లేరు. సిట్ దర్యాప్తు ప్రభాకర్ రావు వద్దే ఆగిపోయింది. కానీ రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు నవీన్ రావు ప్రమేయం వుందని స్పష్టత వచ్చేసింది. సో ఆయన ఎవరు చెపితే ఈ దందా చేశారనేది తేల్చుకోవాలి.రాధ కిషన్ రావు సమాచారం మేరకే జూబ్లీహిల్స్ సమీపంలో ట్యాపింగ్ స్థావరం వెలుగులోకి వచ్చింది.
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో ఈ అడ్డా లోనే ప్రణీత్ రావు బృందం ఎక్కువగా ఉన్నారు . రేవంత్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని ఇక్కడి నుంచే సులువు అవుతుందని ఆ టీం భావించింది. ఈ అడ్డా నుంచే అడిషనల్ ఎస్పీ భుజంగరావుకూడా ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమాచారం మొదట నవీన్ రావు కు చెప్పేవారు. ఈ అడ్డకు నవీన్ రావు కూడా వచ్చే వారని సమాచారం ఈ మేరకు నిందితులు వెల్లడించిన సమాచారం మేరకే ఇప్పుడు పోలీసులు సోదాలు చేశారు .
ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్‌కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే నవీన్ రావు గెస్ట్ హౌజ్ మేలని ప్రణీత్ రావు బృందం భావించింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి నిర్వహించినట్లు నిందితులు దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం రేపో, మాపో దర్యాప్తు పిలిచి విచారణ జరిపే ఆలోచన కు సిట్ వచ్చింది. ఆయన దుబాయి వెళ్లి పోయారని ప్రచారం జరుగుతుంది. ఆయన్ని ఎలాగైనా విచారణకు రప్పించాలనే ఆలోచనలో సిట్ ఉంది. ఆయనకు సన్నిహితుడైన ఐజి తో సిట్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.