నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ పాలక మండలి సమావేశం కాసేపట్లో మొదలు కాబోతుంది.మేయర్ నీతూ కిరణ్ అధ్యక్ష తన జరిగే చివరి సమావేశానికి అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ హాజరు కానున్నారు.
పాలక మండలి అయిదేళ్ల పదవీ కాలం పూర్తీ కాబోతుంది ఈ నెలాఖరులో పదవీ కాలం పూర్తీ కానుంది. బిఆర్ యస్ ప్రభుత్వ హయాంలో పాలక మండలి కొలువు దీరింది.
ఆ పార్టీ అధికారంలో ఉన్నాసరే మున్సిపల్ ఎన్నికల్లో బొక్కా బోర్లా పడింది బీజేపీ, యంఐయం పార్టీలు ఎక్కువ స్థానాలు గెలిచింది.
సింగిల్ డిజిట్ స్థానాలు సాధించినా బిఆర్ యస్ యంఐయం సపోర్ట్ తో మేయర్ స్థానం కైవసం చేసుకుంది ఆతర్వాత పది మంది బీజేపీ కార్పొరేటర్లు కాసుల ఏర వేసి బిఆర్ యస్ లో చేర్చుకున్నారు. అవినీతి ఆరోపణలు వివాదాలు తలెత్తాయి.
