నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీటీడీపీ నాయకులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి టీటీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు యాదగౌడ్ ఆధ్వర్యంలో పూలమాలు వేసి నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠించి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేశారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు.
