Sunday, April 19, 2026
HomeLaw and Orderఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను తనిఖీలు చేసిన మున్సిపల్ కమిషనర్..

ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను తనిఖీలు చేసిన మున్సిపల్ కమిషనర్..

భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మకరంద్ అధికారులను ఆదేశించారు.

గురువారం నగరంలోని నాన్ లేఅవుట్ ప్లాట్లను పరిశీలించారు. మొబైల్ యాప్ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.

దరఖాస్తుల పరిశీలన సందర్భంగా గమనించిన అంశాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!