మృగశిర కార్తీ పండగ వేళా నైరుతి రుతు పవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ నుంచి గద్వాల్ జిల్లా మీదుగా నైరుతి రుతు పవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి.
రానున్న రెండు మూడు రోజుల్లో నైరుతి రుతు పవనాలు రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. రుతు పవనాల ఆగమనంతో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురవనున్నాయి.
.మే 24న అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. అటు నుంచి కర్నాటక, మహారాష్ట్ర మీదుగా జూన్ 6న ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతు పవనాలు ఎంటర్ అయ్యాయి. ఏపీ మీదుగా జూన్ 8న నైరుతి రుతు పవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి.
