నాంపల్లిలో అమ్మవారి విగ్రహం పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలనీ హిందూ సమాజం ఏకమై నిరసన వ్యక్తం చేశారు.
గురువారం హైదరాబాద్లోని నాంపల్లి లో అమ్మవారి విగ్రహం పై దాడి జరిగిన సందర్భంగా శుక్రవారం నగరంలోని సంజయ్ పురోహిత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో హిందువులపై జరుగుతున్న దాడుల మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మన భారత దేశంలో కూడా అదే స్థితి అవుతుందని ఆయన మండిపడ్డారు.
అమ్మవారి విగ్రహంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమాజ్ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
