నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ లలో కాపర్ తీగ ను ఎత్తుకెళ్లే ముఠా ను నిజామాబాద్ జిల్లా పోలీసులు ఎట్టకేలకు వల పట్టుకున్నారు.
మహారాష్ట్ర లోని ధర్మాబాద్ ప్రాంతానికి చెందిన ముగ్గురు సభ్యులున్న ముఠా గత మూడు నెలలుగా నిజామాబాద్ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో పంట పొలాల్లో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ల కాయిల్స్ లో అత్యంత విలువైన రాగి తీగ ను ఈ ముఠా చోరీ చేస్తుంది.
ఈ తరహా దొంగతనాల ఫై విద్యుత్ శాఖ అధికారుల నుంచి పిర్యాదులు వెల్లువెత్తు తున్నా సరే స్థానిక పోలీసులు దృష్టి పెట్టలేని పరిస్థితి అందుకే ప్రత్యేక పోలీసు లు రంగంలోకి దిగి ఈ ముఠా ను వల పన్ని పట్టుకున్నారు.
