HomeLaw and Orderకొలిక్కి రాని దాడి కేసు …. న్యాయవాదుల నిరసన…సెక్షన్ మార్చేసిన పోలీసులు ఇంకా చిక్కని నిందితులు...

కొలిక్కి రాని దాడి కేసు …. న్యాయవాదుల నిరసన…సెక్షన్ మార్చేసిన పోలీసులు ఇంకా చిక్కని నిందితులు …..ముమ్మరంగా సాగుతున్న వేట..

అడ్వకేట్ కాశీం పై జరిగిన దాడి కేసులో దర్యాప్తు కనీస పురోగతి లేకుండా పోయింది.దాడి ఘటన ను నిరసిస్తూ న్యాయవాదులు మూడు రోజులపాటు ఆందోళనచేయడంతో తాత్కాలిక ఉపశమనంగా కేసు సెక్షన్ లో నిందితుల మీద హత్య యత్నం కేసు నమోదు చేశారు ఆ మేరకు మెమో దాఖలు చేశారు. దీనితో న్యాయవాదులు మెత్తబడ్డారు. మరో వైపు అడిషనల్ జడ్జి కనుక దుర్గా సైతం నచ్చజెప్పడంతో న్యాయ వాదులు ఆందోళన వదిలి విధుల్లో చేరారు . సీనియర్ న్యాయ వాదీ ఖాసిం మీద దాడి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పునః పరిశీలించి సెక్షన్ అల్ట్రేషన్ మేమో కోర్టులో ఫైల్ చేస్తూ (307crpc)109BNS దాడి చేసిన వారిమీద నమోదు చేశారు. విచారణ సరైన పద్ధతిలో జరిపి తగు న్యాయం జరిగే విధంగాచూస్తామని అదనపు డీసీపీ బస్వారెడ్డి .పరారీ లో నిందితులను తొందరలోనే పట్టుకుంటామని న్యాయవాదులకు ఆయన భరోసాఇచ్చారు న్యాయవాది పై దాడి చేసిన నిందుతులకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.దీనితో న్యాయవాదులు వెనక్కి తగ్గారు కోర్టు ల్లో కేసుల విచారణ యధావిధిగా హాజరు అయ్యారు. దాడి జరిగి వారం రోజులైనా కీలక నిందితులెవ్వరూ ఇంకా పోలీసులకు చిక్కడం లేదు. ప్రత్యేక బృందం చేస్తున్న గాలింపు యత్నాలు ఫలించడం లేదు. నిందితులు అధికార పార్టీ కి చెందిన వారు కావడంతో నే పోలీసులు కఠిన కార్యాచరణ తో వ్యవహరించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. దాడి కేసులో ఒత్తడి పెరుగుతున్న నేపథ్యంలో నిందితులు లోగిపోయేలా చేయాలనీ పోలీసుల నుంచి అధికార పార్టీ ముఖ్యుల మీద ఒత్తిడి మొదలయ్యింది. లేని పక్షంలో మరింత రచ్చ అయ్యే ప్రమాదం వుందనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతుంది. దాడి గురైన న్యాయ వాదీ ఖాసిం ను యంఐయం నేతలు సైతం ఆదివారం పరామర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments