Monday, May 4, 2026
HomeCRIMEనమ్మించి నగలు కాజేసిన మహిళా అరెస్ట్...చోరి కేసులో సొత్తు రికవరీ..

నమ్మించి నగలు కాజేసిన మహిళా అరెస్ట్…చోరి కేసులో సొత్తు రికవరీ..

నగరంలోని ఓ ఇంట్లో నమ్మించి నగలు కాజేసిన మహిళాను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.అలాగే ఆమె నుంచి కాజేసిన కొంత సొత్తు ను రికావరి చేసినట్లు తెలిపారు.

ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..ఇటీవల నగరంలోని కుమార్గల్లీలో నివాసముంటున్న గంగావిషన్ ఇంట్లోని బంగారం,వెండి కొంత నగదును గాయత్రి అనే మహిళ స్నేహం ముసుగులో ఇంట్లోకి చొరబడి చోరి చేసినట్లు తెలిపారు.

దీంతో బాధితుల బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి నిందితురాలైన గాయత్రిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరికి పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారని తెలిపారు.

ఈ మేరకు ఆమె వద్ద నుంచి 8 తులల బంగారం,కిలో 300 గ్రాముల వెండి, రూ 50 వేల నగరు రికవరీ చేసినట్లు తెలిపారు.దీంతో ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!