HomePOLITICAL NEWSUncategorizedపోలీసు కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ

పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ

నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఎన్నికల కమిషన్ కల్మేశ్వర్ నిజామాబాద్ సీపీ గా నియామకం అయ్యారు. మొదటి నుంచి ముక్కుసూటిగా వ్యవహరిస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను యధావిధిగా కొనసాగిస్తూ వచ్చింది.

లోకసభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బదిలీ అవుతారని అధికార పార్టీ అగ్ర నేతలు ధీమాగా ఉండే కానీ అనూహ్యంగా ఆయన భార్య ను సైతం డిచ్ పల్లి బెటాలియన్ కు ప్రభుత్వం బదిలీ చేయడంతో అధికార పార్టీ నేతలు కంగు తిన్నారు. శాంతి భద్రతల నిర్వహణ బదిలీ ల్లో ఆయన నిక్కచ్చిగా వుండడం అధికార పార్టీ పెద్దలకు నచ్చింది ముఖ్యంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కల్మేశ్వర్ తీరు కు ఫిదా అయ్యారు.

కానీ మిగిత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు నియోజకవర్గ ఇంచార్జి లు మాత్రం సీపీ తీరు ను రగిలి పోయారు అసలు పోలీసు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికే జడుసుకున్నారు. అందుకే ఆయన బదిలీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అందుకే శుక్ర వారం ఆయన బదిలీ వార్త తెలిసి ! హమ్మయ్య బదిలీ అయ్యారా ? అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు..ఎస్సై సీఐ బదిలీ ల్లోనూ ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ల సిఫార్స్ లను పక్కకు పెట్టేసారు.

పోస్టింగ్ లకోసం నేతల వద్దకు వెళ్లకుండా అధికారులను సైతం కట్టడి చేశారు. అయినా సరే సిఫారస్ లతో పోస్టింగ్ లు పొందిన అధికారులకు చుక్కలు చూపించారు. అందుకే ఆయన ప్రమేయం లేకుండా జిల్లాకు రావడానికి అధికారులు వణికి పోయారు.కానీ బిఆర్ యస్ హయాంలో అడ్డగోలు వ్యవహారాలు చేసిన అధికారులే ఇంకా కీలక పోస్టింగ్ ల్లో కొనసాగడం వారికి ఏ మాత్రం మింగుడు పడలేదు. అందుకే ఆయన బదిలీ కావాలని వారంతా తపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments