నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తి తరచుగా మద్యం మత్తులో 100 డయల్ చేసిన వక్తికి గురువారం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు మూడు రోజులు జైలు శిక్ష విధించినట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నగరంలోని 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మ నగర్ కు చెందిన నారాయణ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి మద్యం సేవిస్తూ ప్రతిరోజు అనేకసార్లు అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన
డయల్ 100 నెంబర్ కు కాల్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న నారాయణ అనే వ్యక్తిని గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా విచారించిన మెజిస్ట్రేట్ నారాయణకు మూడు రోజుల జైలు శిక్ష విధించారు.
అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన డయల్ 100 నంబర్ ను దుర్వినియోగం చేయకుండా ఆపదలో ఉన్నవారికి సహాయ పడే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని
ఎవరు కూడా అనవసరంగా పోలీసు వారిని ఇబ్బంది పెట్టాలని పలుమార్లు చేసినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.