కమిషనరేట్ పరిధి లో అదుపు తప్పిన వసూళ్ల దందా లకుఎగబడుతున్న పోలీసులమీద కమిషనర్ కఠిన చర్యలకు ఆదేశించారు.
అలాగే పోలీసుల మాటున వసూళ్ల దందా సాగిస్తున్న ముఠా మీద సైతం కొరఢా ఝులిపించారు. ఇది సంగతి వచ్చినా రెండు వరుస కథనాల మీద కొత్వాల్ కఠిన చర్యలకు ఆదేశించడం గమనార్హం.
రాబోయే రోజుల్లో తన పనితీరు ఎలా ఉండబోతుందో కమిషనర్ స్పష్టం అయిన సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా జిల్లాలో పీడీఎస్ బియ్యం ఇసుక అక్రమ రవాణాల విషయంలో కమిషనర్ కఠినంగా ఉండ బోతున్నారు.నిజామాబాద్ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధి లోకి వచ్చే నవీపేట్ స్టేషన్ పరిధి లో గస్తీ పోలీసులు ఇద్దరు .
చేతికి చిక్కిన పిడియస్ బియ్యంను వదిలేసారు. అక్కడిక్కడే నిందితుడి తో రూ 15 వేల కు డీల్ కుదుర్చుకొని జేబులో ఉన్న నగదు సర్దు బాటు కాక పోవడంతో చివరికి ఫోన్ పే తో ద్వార మిగితా మొత్తం వసూలు చేసుకొని బియ్యం వాహనం ను వదిలేసారు.
నగరానికి చెందిన ఓ యువకుడు మిర్చి కాంపౌండ్ నుంచి 15 క్వింటాళ్ల బియ్యం ను బోధన్ మీదుగా మహారాష్ట్ర కు తరలించడానికి గత రెండు రోజుల క్రితం మినీ డీసీఎం రాత్రి బయలు దేరాడు. గుండారం మీదుగా వెళ్ళాడు.
రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో గుండారం నవీపేట్ మధ్య రైల్వే గేట్ సమీపంలో గుట్ట వైపు నుంచి గ్లామర్ బైకు మీద వచ్చిన ఇద్దరు గస్తీ కానిస్టేబుళ్లు ఈ వాహనం ను డ డ్రైవర్ గస్తీ పోలీసులతో బేరం మొదలు పెట్టాడు.
తన జేబులో ఉన్న 4300 వేలు ఇచ్చి మిగితా. నిజామాబాద్ నగరంలో తన స్నేహితుడి ని సంప్రదించి ఫోన్ పే ద్వార నేరుగా గస్తీ పోలీసు ల ఫోన్ కు బదిలీ చేయించారు. దీనిపై ఈ నెల 17 న ఇది సంగతీ స్పెషల్ ఎడిషన్ లో కథనం రావడంతో కమిషనర్ సాయి చైతన్య నేరుగా నవీపేట్ ఎస్సై తో విచారణకు ఆదేశించారు .
దీనితో రంగంలోకి దిగిన ఎస్సై ఆ వసూళ్ల కు పాల్పడిన గస్తీ కానిస్టేబుళ్లను గుర్తించారు. కానిస్టేబుల్ రాజేష్. హోంగార్డ్ అసిఫ్ లను విచారించడంతో వారిద్దరూ అంగీకరించారు. దీనిపై తదుపరి చర్యల కోసం కమిషనర్ కు నివేదించారు. వారిద్దరిని ఏ ఆర్ హెడ్ క్వాటర్ కు అటాచ్ చేశారు వారిని గ్రౌండ్ లో అయిదు రౌండ్లు పరిగెత్తించారు.
అలాగే టాస్క్ ఫోర్స్ ముసుగులో వసూళ్ల దందా శీర్షికన ఈ నెల 19 న వచ్చిన మరో కథనం మీద సైతం కమిషనర్ బోధన్ సీఐ విజయ్ బాబు తో విచారణకు ఆదేశించారు కఠిన చర్యలు తీసుకొవాలని పురమాయించారు.
దీనితో తాను టాస్క్ ఫోర్స్ సీఐ అంటూ ద్విచక్ర వాహనాలతో పాటు ఆటో రిక్షాలు …టాటా ఏసీ లాంటి తేలికపాటి వాహనాలను లక్ష్యంగా చేసుకొని వాటినే పోలీస్ లతరహాలోనే వాహనదారులనుంచి వసూళ్ల చేస్తుంది ఎవరనేది అరా తీశారు. ఫోన్ పే చెల్లింపు లో ఉన్న ఐడి ద్వార నిందితుడి ని గుర్తించారు.
కందుకుర్తి కి చెందిన సతీష్ ను అదుపు లోకి తీసుకోని విచారించారు సోమవారం నిజమాబాద్ నగరం కు చెందిన ఇద్దరు ఆటో రిక్షా లో 10 క్వింటాళ్ల బియ్యం వెళ్తుండగా పట్టుకున్నాడు అయిదు వేలకు బేరం కుదుర్చుకున్నాడు.
కానీ తన వద్ద రెండు వేల నగదు వుందని చెప్పగా ఫోన్ పే ద్వార మరో మూడు వేలు బదిలీ చేయించుకున్నాడు.ఫోన్ పే ఖాతాల లతో నిర్దారించుకున్నారు. దీనితో సతీష్ ఫై కేసు నమోదు చేసారు అతన్ని రిమాండ్ కూడా చేయడానికి సిద్ధం అవుతున్నారు.
