జాన రమేష్ : ఇది సంగతి : ఆర్మూర్ : నిండు నూరేళ్లు జీవించాల్సిన ఓ పసికూన.. కన్నతల్లి అజాగ్రత్తతో కన్నుమూసిన విషాద ఘటన నందిపేట్ బస్టాండులో చోటుచేసుకుంది. కని పెంచిన కన్నతల్లి రూపంలోనే మృత్యువు కబలించిన ఘటన.. చూపరులను కాకావికలం చేసింది. ఇటీవల భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామంలో ఓ చిన్నారిని.. కన్నతల్లి చేతులతో పిసికి హత్య చేసిన ఘటన మరువకముందే… మరో పసికూన మృత్యువాత పడిన ఘటన వెలుగులోకి వచ్చింది… నందిపేట్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఓ గుర్తు తెలియని మహిళా నాలుగు నెలల బాబుతో కలిసి నిద్రపోయింది. నిద్రలో తల్లి బాబుపై పడటంతో ఊపిరాడక పసికందు మృతి చెందింది. మెలకువ వచ్చిన తల్లి… చిన్న బిడ్డ స్పందించకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించడం అందరికీ కలిచి వేసింది. దృశ్యం చూసిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
పాపం.. పసికూన..కన్నతల్లి ఆజాగ్రత్తతో కన్నుమూసిన నాలుగు నెలల చిన్నారి..నందిపేట్ బస్టాండులో చోటు చేసుకున్న ఘటన…కేసును విచారిస్తున్న నంది పేట్ పోలీసులు
RELATED ARTICLES
