మావోయిస్టు పార్టీ మరో ఎదురు దెబ్బ తగిలింది.జార్ఖండ్ లో గురువారం తెల్లవారుజాము భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మరణించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ నాయకుడు మిసిర్ బెస్రా తో పాటు మరికొందరు కీలక సభ్యులు ఉన్నట్లుగా సమాచారం
పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని కిరిబురు, ఛోటానాగ్ర పోలీస్ స్టేషన్ల పరిధిలోని సంరండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
జార్ఖండ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ కోబ్రా 209 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా, పొంచి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి ధీటుగా భద్రతా బలగాలు ఎదురుదాడి చేయడంతో గంటల పాటు భీకర పోరు కొనసాగింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు
