కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రగిలిపోతున్నారు ఆయన తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరి చేసే విషయంలో జరుగుతున్న జాప్యం లో లోపల మదన పడుతున్నారు
ఆదివారం బాన్స్ వాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్ధాపూర్ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతి ని పరిశీలించడానికి ఆయన ప్రాజెక్ట్ సైట్ కు వెళ్లారు.
పనుల్లో పురోగతి లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు సంబంధిత అధికారితో ఆయన అక్కడి నుంచే ఫోన్ లో అరా తీశారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరి కాకపోవడం వల్ల గుత్తేదారు పనులు చేయడం లేదని అధికారి స్పష్టం చేసారు.
దీనితో పోచారం ఒక్కసారిగా ఆవేదన వెళ్లగక్కారు సీఎం కు కనీసం 20 సార్లైనా చెప్పి ఉంటా అయినా ఫలితం లేదు. నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాలు మొక్కాల్నా?
బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి.
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసారు
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండంటూ
ఈ ప్రభుత్వంలో మంత్రుల ఫోన్లు లెత్తడం లేదు నేను చాల కాలం మంత్రిగా పనిచేశా ఎమ్మెల్యే ల ఫోన్ లు అర్ద రాత్రిఅయిన ఎత్తేవాడినంటూ ఆవేదన చెందారు ? ప్రభుత్వం ఉందా… ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుంని వాపోయారు
