అధ్యాపకులను రిలీవ్ చేయకుంటే చర్యలుఈ నెల 24వ తేదీ నుండి ఇంటర్ సప్లమెంటరీ రెండవ స్పెల్ సబ్జెక్ట్ ల మూల్యాంకనం ప్రారంభం అవుతుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. బోటనీ, జూవలోజీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్ట్ ల అధ్యాపకులు అందరూ 24వ తేదీన నిజామాబాద్ లోని ఇంటర్ మూల్యాంకనం కేంద్రంలో రిపోర్ట్ చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల లాగిన్ లలో అధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్ లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందని ఆయన తెలియజేశారు.
మూల్యాంకన విధులు ఉన్న అధ్యాపకులను 23 వ తేదీన రిలీవ్ చేయాలని ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. ప్రైవేటు యాజమాన్యం అధ్యాపకులను రిలీవ్ చేసినట్టయితే ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా
విద్యా అధికారి స్పష్టం చేశారు. ఆయా సబ్జెక్ట్ ల అధ్యాపకులందరూ 24 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకనం లో అధ్యాపకులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన ఆదేశించారు.
