HomePOLITICAL NEWSInternationalఆఫ్ఘన్ ఫై ఇండియా ఘన విజయం ......ఇన్నింగ్ 300 రన్స్ తో విజయం

ఆఫ్ఘన్ ఫై ఇండియా ఘన విజయం ……ఇన్నింగ్ 300 రన్స్ తో విజయం

న్యూ చండీగఢ్ లోని ముల్లన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన అయిదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది… ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు ఇదే అత్యంత భారీ విజయం సాధించింది.

అఫ్గనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ నిర్దేశించిన 564/8 (డిక్లేర్డ్) భారీ స్కోరుకు సమాధానంగా బరిలోకి దిగిన అఫ్గనిస్థాన్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది.

తొలి ఇన్నింగ్స్ కేవలం 152 పరుగులకే కుప్పకూలడంతో భారత్ ఫాలోఆన్ విధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గన్‌కు మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. భారత స్పిన్ మాయాజాలానికి వికెట్లను సమర్పించుకుంటూ రెండో ఇన్నింగ్స్ లోనూ 112 పరుగులకే చాపచుట్టేసింది.

భారత్ తరఫున అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్ 6 వికెట్లతో చెలరేగగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కూడా కీలక వికెట్లతో అఫ్గన్ పతనాన్ని శాసించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments