HomePOLITICAL NEWSUncategorizedనిజామాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భారీగా బదిలీలు..పాతుక పోయిన వారికి ఝలక్ ......బోధన విధులు ఏగొట్టి...

నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భారీగా బదిలీలు..పాతుక పోయిన వారికి ఝలక్ ……బోధన విధులు ఏగొట్టి గప్పాలు కొట్టే పంతులకు బదిలీ

చాల కాలం తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రి (జీజీహెచ్)లో భారీగా బదిలీలు చోటుచేసుకున్నాయి.ఏళ్ల తరబడిగా ఇక్కడే పాతుక పోయిన డాక్టర్ల కు ఎట్టకేలకు సర్కార్ ఝలక్ ఇచ్చింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కీలక ప్రజాప్రతినిధుల పంచన చేరి పబ్బం గడుకునే డాక్టర్ల ఈసారి బదిలీ వేటు తప్పిచుకోలేక పోయారు.

కీలక మైన బోధన బాధ్యతలు గాలికి వదిలేసి చుట్టపు చూపు వచ్చి కాసేపు గప్పాలు కొట్టి వెళ్లి పోయేది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కీలక ఉత్తర్వులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య విభాగంలో సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే.

ఇందులో భాగంగా ఆన్‌లైన్ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల నుంచి ఆప్షన్లను స్వీకరించారు.నిబంధనల ప్రకారం,ప్రభుత్వ బదిలీల జాబితాలో భాగంగా వైద్యులను హైదరాబాద్‌లోని పలు ప్రముఖ ఆసుపత్రులకు, ఇతర ప్రాంతాలకు కేటాయించారు.గాంధీ ఆసుపత్రికి: డాక్టర్ నాగమోహన్, డాక్టర్ జలగం తిరుపతి రావు, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ కిషోర్, డాక్టర్ వి.వి.రావులను బదిలీ చేశారు.

నీలోఫర్ ఆసుపత్రికి: డాక్టర్ పి.శ్రీనివాస్‌ను నియమించారు.కుత్బుల్లాపూర్‌కు: డాక్టర్ ప్రతిమా రాజ్‌కు స్థానచలనం కలిగింది.ఇతర ప్రాంతాలకు: డాక్టర్ అమ్తుల్, డాక్టర్ శివ ప్రసాద్, డాక్టర్ బి.శ్రీనివాస్, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రవి కిరణ్‌లు బదిలీపై వెళ్లిన వారిలో ఉన్నారు.

బదిలీ అయిన ప్రొఫెసర్ వెంటనే కొత్త స్థానంలో చేరాలని, సంబంధిత అధికారులు ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ బదిలీకి సంబంధించి ఎటువంటి ట్రాన్స్‌ఫర్ అండ్ ట్రావెలింగ్ అలవెన్స్, జాయినింగ్ టైమ్ వర్తించదని పేర్కొంటూ, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డర్ లో ఉన్నాయి.ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిపై జిల్లాలోని వేలాది మంది పేద రోగులు ఆధారపడి ఉన్నారు.

ఇలా కీలక విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులను ఏకకాలంలో బదిలీ చేయడం వల్ల రోగులకు సరైన సమయంలో చికిత్స అందుతుందా? లేదా వైద్య సేవలకు ఆటంకం ఏర్పడుతుందా? అన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టినప్పటికీ, ఖాళీ అయిన స్థానాల్లో తక్షణమే ప్రత్యామ్నాయ వైద్యులను నియమించి, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments