దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేశారు . ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది సీఈసీ. ఆంధ్రప్రదేశ్లో మే 13వతేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సీఈసీ ప్రకటించారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26న రెండో దశ , మూడో దశలో మే7న , మే 13న నాలుగో దశలో, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. అదే సమయంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని సీఈసీ తెలిపింది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రెస్మీట్లో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. షెడ్యూల్ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
