లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు ను నిరసిస్తూ శనివారం తలపెట్టిన ఆందోళనలు మొక్కుబడిగా జరిగాయి. నియోజకవర్గ ఇంచార్జ్ లుగా ఇంకా చెలామణి లో ఉన్న మాజీ ఎమ్మెల్యే లందరూ మొహం చాటేశారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఇద్దరు ఎమ్మెల్యే సైతం డుమ్మా కొట్టారు. ఎంపీ అభ్యర్థి సైతం జాడ కనిపించలేదు.
మొత్తానికి ఎదో మొక్కబడి తంతూ ముగించారు.ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఆమెకు మెట్టినిల్లుజిల్లాలోనే పార్టీ దయనీయ పరిస్థితి కి అద్దం పట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ అర్బన్ బోధన్ నియోజకవర్గాల కు ఇంచార్జ్ గా పనిచేసారు.
అలాగే పార్టీ స్టార్ క్యాంపైనర్ గా నిజామాబాద్ లోకసభ పరిధి ఏడు నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేసారు. ఈసారి అర్వింద్ ను ఓడించడానికి ఆమె బరిలో దిగుతారని భావించారు. అయినప్పటికి బిఆర్ యస్ పక్షాన రంగంలోకి దిగుతారని ఎదురుచూస్తున్నారు.కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసారు.
ఈపాటికే పార్టీ అధికారం కోల్పోయి వరుస వలసలతో బేజారు అవుతుంది. ఈ నేపథ్యంలో కవిత అరెస్టు ఉదంతం ను ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ఆందోళనకు పిలుపు నిచ్చారు. సానుభూతి వర్క్ అవుట్ అవుతుందని అంచనాలు కూడా వేశారు. కానీ శనివారం జరిగిన ఆందోళనలు పార్టీ దయనీయ స్థితి ని బట్టబయలు చేసాయి. నిజామాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ పేరున్న నేత ఈ ఆందోళన లో కనిపించలేదు.
మాజీ ఎమ్మెల్యే లు మొహం చాటేశారు. హైదారాబాద్ లో కవిత ఇంటి వద్ద హడావుడి చేసిన జీవన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి లు శనివారం తమ నియోజకవర్గాల్లో మాత్రం నిరసన కార్యక్రమాలకు డుమ్మాకొట్టారు. ఎంపీ అభ్యర్థిగా ఖరారు అయిన బాజిరెడ్డి గోవర్ధన్ సైతం రాలేక పోయినా ఆయన తనయుడు జగన్ సందడి చేసారు.
మరో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కూడా హైదారాబాద్ కు పరిమితం అయ్యారు.బాన్స్ వాడ నియోజకవర్గం ను రెండు ముక్కలు చేసి పాలన, పార్టీలో పెత్తనం సాగించిన ఇద్దరూ తనయులు అడ్రస్ కనిపించలేదు.
జిల్లాలో ని అన్ని నియోజకవర్గాల్లో ను ఆందోళనలు ఏదో మొక్కుబడిగా లోకల్ లీడర్లు కానిచ్చేశారు. గతంలో ఢిల్లీ లో కవిత ఈడీ విచారణ కు వెళ్తే విమానం లో వెళ్లిన చోట నేతలు ఈసారి కనీసం తమ ఏరియా లో జరిగే ఆందోళనలను సైతం లైట్ తీసుకున్నారు.కవిత జిల్లాకు వస్తే హడావుడి చేసే కవులు జాగృతి నేతలు సైతం ఆందోళన ల వైపు కన్నెత్తి చూడలేక పోయారు.