ఎమ్మెల్సీ కవిత అరెస్టు కు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్దం చేశారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేకే బిజెపి కుట్రలు అందుతుందని పట్టణ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కక్షపూరితంగా ఈడి చే దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
చట్టంపై తమకు నమ్మకం ఉందని… కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బిజెపి పార్టీకి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజల బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, పోల సుధాకర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.