హలో పాల్గొన్న ఎంపీ అరవింద్, నగర ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త, మల్లికార్జున్ రెడ్డి, దినేష్ కులాచారిజాన రమేష్, ఇది సంగతి : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హిందూ వ్యతిరేకిగా మారారని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… శుక్రవారం అని చూడకుండా ఆడపడుచును తీసుకెళ్లారని, బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. శుక్రవారం నాడే లిక్కర్ స్కాం సన్నాహాలు జరిగాయని పేర్కొన్నారు.
లిక్కర్ స్కాం చేసేటప్పుడు శుక్రవారం అని గుర్తు రాలేదా అంటూ విమర్శించారు. అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని కవిత శపథం చేసిందని విలేకరులు గుర్తుచేయగా.. జైలు నుంచి నామినేషన్ వేస్తారా? అని ఆయన వ్యాఖ్యానించారు.
హిందూ వ్యతిరేకి జీవన్ రెడ్డి…జగిత్యాల పి ఎఫ్ ఐ అడ్డ మారిందని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లింలతో కలిసి ఆజాది ఆజాది అంటూ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాలను మరో పాకిస్తాన్ గా తయారు చేస్తున్నారని ఎంపీ విమర్శించారు. భావితరాలు బాగుండాలంటే మోడీ పాలని దేశానికి శ్రీరామరక్ష అన్నారు.
మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ద న్ పల్ సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి , నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి , నియోజకవర్గ ఇన్చార్జి పాలెపు రాజు, నాయకులు పుప్పల శివరాజు తదితరులు పాల్గొన్నారు.