మందుపాతరలను గుర్తుపట్టేపోలీసు జాగిలం బుధవారం అనారోగ్యంతో మృతి చెందింది
ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్)రీ బి. కోటేశ్వర్ రావ్ పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు పోలీస్ బ్యాండ్‌తో అంత్యక్రియలు నిర్వహిచారు అదనపు డి.సి.పి (అడ్మిన్) మాట్లాడుతూ డాగ్ గోల్డి ( జాగిలం ) 2016 బ్యాచ్ నుండి విధులు నిర్వహిస్తుందని, ప్రెసిడెంటు, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఇవాంక ట్రంప్, అసెంబ్లీ, ఉప్పల్ స్టేడియలలో డ్యూటీలు నిర్వహించిందని అనేక పతకాలు మరియు ప్రశంసాపత్రాలు వచ్చాయన్నారు .
ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన వారు ఆర్మూడ్ రిజర్వు ఎ.సి.పి నాగయ్య, హోమ్ గార్డ్సు ఎ.సి.పి అరుణ్ కుమార్, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ (అడ్మిన్) సతీష్, (ఎమ్.టి.ఓ) తిరుపతి, (వెల్ఫేర్) శ్రీనివాస్, జిల్లా వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ డా॥ హన్మంత్ రెడ్డి మరియు డాగ్ స్కాడ్ సిబ్బంది మనోహర్, సాయన్న, జగదీష్, మోహన్, శ్రీకాంత్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
