HomeHEALTHకళ్ళు తెరవకముందే..! కళ్ళు మూసేశారు…!!

కళ్ళు తెరవకముందే..! కళ్ళు మూసేశారు…!!

◆అప్పుడే పుట్టిన బిడ్డను బలిగొన్న వైద్యులు…?

◆ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కరువు….?

◆ఆసుపత్రి సూపర్డెంట్ వివరణ కోరగా మీడియాను తప్పుతోవా…?

◆బాధితుల వివరణ కోరగా ఆస్పత్రిలో డాక్టర్ల లేరు..

◆నర్సులు మాత్రమే డెలివరీ చేస్తున్నారు..

◆నా బిడ్డ మరణానికి డాక్టర్లే నిర్లక్ష్యం…

◆నాకు వచ్చిన పరిస్థితి మరొకరికి రావద్దు అంటున్న బాధితుడు..

◆నా ఉద్యోగం ఎల్లారెడ్డిలో నేను గాంధారి కి డిప్యూటీషన్లో పనిచేస్తున్న అంటున్నా సూపర్డెంట్…◆డిప్యూటేషన్ ఉంటే బాధ్యత ఉండదా..?

◆ గాంధారి ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతే నిజామాబాద్ ఆసుపత్రి చనిపోయాడని మీడియా తో సూపర్డెంట్ వివరణ

◆ఇదంతా పై అధికారులకు తెలిసే జరుగుతుందా.. లేదా తెలియక జరుగుతుందా అని బాధితులు వాపోయారు..

◆ తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తారా…?మేమోలతో సరిపెట్టుకుంటారా…?గాంధారి మండల కేంద్రంలోనిప్రభుత్వ ఆసుపత్రిలో లోతిప్పారం గ్రామానికి చెందిన మద్దెల వీరప్రసాద్. భార్య కృప సాయంత్రం డెలివరీ నిమిత్తం మూడున్నర గంటలకు డెలివరీ చేస్తున్న సమయంలో బాబు పుట్టాడు కానీ అంతలోనే బాబు హార్ట్ బీట్ సరిగ్గా పనిచేయడం లేదని అక్కడే పని చేస్తున్న వైద్య సిబ్బంది చెప్పడం జరిగింది.

కానీ బిడ్డ చనిపోయాడని విషయం తెలిసి వైద్య సిబ్బంది ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లండి అక్కడ చూపియండి అని చెప్పడంతో బాబు తండ్రి వీరప్రసాద్ తిసుకొని వెళ్లడం జరిగింది.

అక్కడికి తీసుకెల్లే సరికి అక్కడ నుండి డాక్టర్ వేరే చోటుకు వెళ్ళమని చెప్పడం జరిగింది.వేరే ఆసుపత్రికి వెళ్లడంతో బాబు చనిపోయాడని చెప్పడం జరిగింది. వారు ఇక్కడ ఉన్న వైద్య సిబ్బందికి ప్రశ్నించగా హార్డ్ బీట్ సరిగా లేనందు వల్లే చనిపోయాడు అని డెలివరీ చేసిన టైంలో అబ్బాయిఎలాంటి స్పందన లేదు అని చెప్పడం జరిగింది.

వైద్య సిబ్బంది చనిపోయిన విషయం చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పైకి ఎలాంటి రిస్కులేకుండా చూసుకోవడానికి ఇలా చేశారని చనిపోయిన బాబు యొక్క తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. నవ మాసాలు మోసిన తల్లి దుఃఖంలో మునిగిపోయిది

.ఇదే విషయాన్ని సదరు సూపర్డెంట్ గా ఉంటున్న డాక్టర్ని ప్రశ్నించగా నాకు ఎలాంటి సంబంధం లేదు అక్కడ డ్యూటీలో ఉన్న మేడంని అడగండి, అమేతో మాట్లాడండి అంటూ చేతులు దులిపేసుకున్న డాక్టర్..

ఇదంతా చూస్తే పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నట్టుగా కనిపిస్తుందని ప్రజలు వాపోతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments