క్షణికావేశంలో వివాహిత ఆత్మ హత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ నగరంలోనీ నాలుగవ టౌన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నగరం లోని వినాయక నగర్ కు చెందిన శిరీష(24).కు శ్రీకాంత్ కు గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిరీష వాళ్ళ చిన్నమ్మ విరితోనే ఉంటుందని తెలిపారు. .
ఈ నెల26న శిరీష కు ఆమె చిన్నమ్మ కు మధ్య చిన్న గొడవ జరిగింది.దానికి శిరీష క్షణికావేశంలో ఇంట్లొకి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుంది. అది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఐ సంజీవ్ తెలిపారు.