HomePOLITICAL NEWSArmoorపరిషత్ లలో 'ప్రత్యేక' పాలన…!స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం నుంచి కోరబడిన స్పష్టత..ముగియనున్న ఎంపీటీసీ ,ఎంపీపీ ,జడ్పిటిసిల...

పరిషత్ లలో ‘ప్రత్యేక’ పాలన…!స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం నుంచి కోరబడిన స్పష్టత..ముగియనున్న ఎంపీటీసీ ,ఎంపీపీ ,జడ్పిటిసిల పదవీకాలం

  • స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం నుంచి కోరబడిన స్పష్టత
  • ముగియనున్న ఎంపీటీసీ ,ఎంపీపీ ,జడ్పిటిసిల పదవీకాలం
  • ప్రత్యేక పాలన దిశగా కసరత్తు చేస్తున్న అధికారులు

జాన రమేష్ : ఇది సంగతి : ఆర్మూర్ :


జూలై 4 , 5 తేదీలలో స్థానిక ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పిటిసిల పదవీకాలం ముగియనుంది. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో జిల్లా పరిషత్ తోపాటు మండల పరిషత్ లలో ప్రత్యేక పాలన కొనసాగనుంది.

ప్రస్తుతం గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతోపాటు జిల్లా మండల ప్రజా పరిషత్ కూడా త్వరలోనే ప్రత్యేక అధికారుల చేతుల్లోనికి వెళ్ళనున్నాయి.

స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఎన్నికల నిర్వహణకు సమయం పట్టే అవకాశం ఉండడంతో మండల జిల్లా పరిషత్తులలో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ప్రభుత్వం నుండి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానాప్పటికిని ప్రత్యేకం కావడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది

ఎన్నికల నిర్వహణ లేనట్టేనా..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంపీటీసీ, ఎంపీపీల కాలం జూలై 4న జడ్పిటిసిల పదవీకాలం జూలై ఐదు న జడ్పిటిసిల పదవీకాలం ముగియనుంది. 2019 లో పరిషత్ ఎన్నికలను గడువు కంటే రెండు నెలల ముందుగానే అప్పటి ప్రభుత్వం నిర్వహించింది.

కానీ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని నిర్వహణపై అంతగా ఆసక్తిగా ఉన్నట్టు కనిపించడం లేదు దీంతో ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన అధికారికంగా వెలువడకపోవడంతో సర్పంచుల తరహాలోని ప్రత్యేక అధికారుల పాలన వచ్చే అవకాశాలున్నట్టు అధికారులు తెలుపుతున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments