డివైడర్ ను ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెర్కిట్ లో జరిగింది .
మోర్తాడ్ కు చెందిన లకవత్ చందు(28) బైక్ మీద మోర్తాడ్ నుంచి ఆర్మూర్ వెళ్తూ అతివేగంగా డివైడర్ ని ఢీ కొట్టడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చికిత్సా పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.