తన సొంత నిధులతో గ్రామం లోని రోడ్లను మరమ్మతులు చేపట్టిన ఓ ప్రైవేట్ స్కూల్ పీఈటీ టీచర్ నిజామాబాద్ జిల్లా శివారులోని గుత్పా తండాకు చెందిన సుమన్ చౌహాన్,ఓ ప్రైవేట్ పాఠశాలల్లో పీఈటీ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తన గ్రామ పంచాయతీ రోడ్లు చిన్నపాటి వర్షానికే గుంతల మయం గా మారిందని సదరు ఆ యువకుడు తనను కని పెంచిన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గుత్ప తండాకు మరో శ్రీమంతుడుల తన సేవాలు మొదలుపెట్టారు.
తన స్వంత నిధులతో గ్రామానికి వెళ్ళే మార్గం లో గుంతల మయం గా మారిన మట్టి రోడ్లు కు మొరం పోయించి గ్రామ ప్రజలతో శభాష్ అనిపించుకున్నాడు. ఆ మరమతులతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..